అదే జోరు… అదే హోరు…

అదే జోరు… అదే హోరు…

ఇంటింటికి, మంగళ హారతులతో విజయ తిలకాలతో…
ఘన స్వాగతం..

అడగడున ప్రజల నీరాజనాలు

ఇంటికి తాళాలు వేసుకొని కంచర్ల వెంట కదిలిన జనం..

నేను ప్రజలను నమ్ముకున్న… కాంగ్రెస్ పార్టీ పైసలను నమ్ముకుంది

మాడుగులపల్లి, అక్షిత న్యూస్ :

చిన్నపిల్లల కేరింతలు, మహిళల కోలాటాలు, డప్పు వాయిద్య కారుల విన్యాసాలతో.. ఉత్సాహ పూరిత వాతావరణంలో… కంచర్ల ప్రచారం సాగుతోంది. నల్గొండ జిల్లా నల్గొండ నియోజకవర్గంలో
7,వ వార్డు సభలో మాట్లాడుతూ కంచర్ల… కెసిఆర్ నాయకత్వంలోని బి ఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే… ఆదర్శంగా నిలిచిందని.. ఇప్పుడు కొత్తగా మానిఫెస్టోలో.. రైతుబంధును 12000 రూపాయలకు పెంచుతూ 16 వేల వరకు అందిస్తామని… ఆసరా పెన్షన్లు 3016 నుంచి ప్రారంభించి 5016 వరకు విడతల వారిగా పెంచుతామని … అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ 6016 వరకు పెంచుతామని.. మహిళలకు 3000 రూపాయలు భృతి కల్పిస్తామని.. 400 రూపాయలకే గ్యాస్ అందిస్తామని, బిపిఎల్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షలరూపాయల బీమా సౌకర్యం కల్పిస్తామని… తెలియజేస్తూ..నల్లగొండ అభివృద్ధిని చూసి.. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావాలంటే.. తనను మరోసారి నలగొండ ఎమ్మెల్యేగా గెలిపించాలని.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. ఎప్పటికప్పుడు మీ సమస్యలు పరిష్కరిస్తూ మీ మధ్య ఉంటూ మీకోసం పనిచేస్తున్న నన్ను మరోసారి కారు గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు.స్థానిక 7 వ వార్డు కౌన్సిలర్ మారగోని భవాని గణేష్, ఆరో వార్డు ఇంచార్జ్ కుందూరు ప్రవీణ్ కుమార్, 25 వ వార్డు ఇంచార్జ్ మాతంగి అమర్ తో పాటు ఆయా వార్డులోని స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking