సీఎం సభకు భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు

సీఎం సభకు భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు

 కిక్కిరిసిన సభా ప్రాంగణం… కోదాడ పట్టణమంతా గులాబీమయం

ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు బస్సుల్లో ద్విచక్ర వాహనాల్లో తరలి వచ్చిన జనం

కోదాడ సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్

జన సమీకరణ చూసి పొంగిపోయిన సీఎం కేసీఆర్

కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్ కు గాలి బాగా ఉందని కితాబు

బీసీ బిడ్డ మల్లయ్య యాదవ్ కు బంపర్ మెజారిటీతో గెలిపించాలని బీసీ చైతన్యం చూపించాలని పిలుపు

 రోడ్లపై భారీగా వాహనాలు

ఊరువాడ కదిలింది…. కోదాడలో కారు జోరు పెరిగింది

కళాకారుల ఆటపాటలో చిందేసిన బిఆర్ ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బొల్లం

సీఎం ప్రసంగం జరుగుతున్నంత సేపు చప్పట్లు ఈలలు జై జై అంటూ నినాదాలు

కోదాడలో కురిసిన జన జడివాన .కోదాడ పట్టణంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం సభ కు కోదాడ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుండి గులాబీ శ్రేణులు భారీగా తరలివచ్చారు ఆటోలు ట్రాక్టర్లు ద్విచక్ర వాహనాలు లారీలు బస్సుల్లో ద్విచక్ర వాహనాలతో జనం కదం తొక్కారు సభా ప్రాంగణం మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది కోదాడ పట్టణమంతా గులాబీ జెండాలతో గులాబీ మయంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్న సమయానికి కొంత ఆలస్యంగా వచ్చినా జనం మాత్రం కదలకుండా సభా ప్రాంగణంలోనే ఉన్నారు వాహనాలతో రోడ్లన్నీ రద్దీగా మారాయి భారీ జనాన్ని చూసి తబ్బి ఉబ్బైనా కేసీఆర్ కోదాడ అభ్యర్థి మల్ల యాదవ్ కు మంచి గాలి ఉందని కితాబు ఇచ్చారు అసమతి నేతలు చెప్పిన మాటలను కొట్టి పారేశారు. మల్లయ్య యాదవ్ జనంతో ఉన్న మనిషి అని తాను గుర్తించానని బీసీ బిడ్డగా ఆశీర్వదించానని బీసీలు చైతన్యం చూపించి ఈనెల 30న జరిగే ఎన్నికల్లో ఓట్లు వేయించి బంపర్ మెజారిటీతో బొల్లం మల్ల యాదవును గెలిపించాలని పిలుపునిచ్చారు సీఎం మాట్లాడుతున్నంత సేపు సభా ప్రాంగణం మొత్తం చప్పట్లు ఈలలతో నినాదాలతో మార్మోగింది ఇప్పటివరకు జరిగిన సభల్లో భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చిన సభ కోదాడ అని విశ్లేషకులు భావిస్తున్నారు మల్లయ్య యాదవ్ జనం నాయకుడని తరలివచ్చిన జనం నిరూపించారు జనం రాకతో సీఎం హామీలతో కోదాడలో కారు జోరు పెరిగిపోయింది జనవర్షం కురవడంతో ప్రతిపక్షాలు ఖంగు తినే పరిస్థితిలో ఉన్నాయి. సభ ప్రారంభానికి ముందు ధూంధాం లో అభ్యర్థి ఎమ్మెల్యే మల్ల యాదవ్ చిందులు వేసి జనాన్ని ఉత్తేజపరిచారు సభ గ్రాండ్ సక్సెస్ కావడం పట్ల మల్లయ్య యాదవ్ తో పాటు రాష్ట్ర టిఆర్ఎస్ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది

Leave A Reply

Your email address will not be published.

Breaking