నోముల భగత్ వెంట జనం

నోముల భగత్ వెంట జనం

గులాబీ మయంలో వందలాదిగా తరలివచ్చిన జనం

అడుగడుగునా ప్రజలు నీరాజనం

నాగార్జునసాగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
అక్షిత న్యూస్ మాడుగులపల్లి: మండలం,లోని అభంగాపురం,పూసలపాడు, గజలాపురం గ్రామాలలో ప్రచారం ముమ్మరం నాగార్జునసాగర్ నియోజకవర్గ ఈశాన్యం మూల అయిన అభంగాపురం గ్రామం నుండి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, ఈ కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జ్లు ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ రాంచందర్ నాయక్ లకు
గ్రామ ప్రజలు మంగళ హారతులతో, డప్పు చప్పుళ్లతో, కోలాటలతో, నిర్వహించి ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం వారు మాట్లాడుతూ నాగార్జునసాగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీతో నే అభివృద్ధి
2014 లో గెలిచి జానారెడ్డి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్ కే పరిమితం అయ్యారు 2018 లో నేను గెలిచిన తరువాత 24 గంటలు నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో వున్నా
36 సంవత్సరాల నుండి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి పాలించిన జానారెడ్డికి నియోజకవర్గం అభివృద్ధ గురించి ఏనాడు పట్టించుకోలేదు
బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇంటికి ఓటు అడగడానికి వస్తే వారిని నిలదీయాలి నవంబర్ 30 వ తారీకున కారు గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి.ఈ కార్యక్రమం లో జడ్పి వైస్ ఛైర్మన్ ఇరిగి పెద్దులు,జిల్లా కో -అప్షన్ సభ్యుడు మౌషిన్ అలీ, మార్కెట్ చంద్ర రెడ్డి, వేములపల్లి పిఎసిఎస్ చైర్మన్ జేరిపోతుల రాములు గౌడ్, మండల అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, జిల్లా నాయకులు పోకల రాజు,డైరెక్టర్ దిలీప్, కాసిం, సర్పంచ్ పగిడిపల్లి రామచంద్రమ్మ, కుక్కమూడి స్రవంతి,ఉపసర్పంచ్ శ్రీకాంత్,శేఖర్, గ్యార సాయిలు, గంగాధర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking