సబ్ కా సాత్, సబ్ కా వికాస్ బీజేపి తోనే సాధ్యం: బల్గూరి రంగారావు.

సబ్ కా సాత్, సబ్ కా వికాస్ బీజేపి తోనే సాధ్యం: బల్గూరి రంగారావు.

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి, అనివార్య కారణాల వల్ల ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పోరేటర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న బల్గూరి రంగారావు ని సోమవారం ఆయన నివాసంలో బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నవంబర్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బల్గూరి రంగారావు సేవలు పార్టీకి అవసరమని గుర్తించి, భారతీయ జనతా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడంలో రంగారావు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పర్వతాలు యాదవ్, నరసింహా చారి, గోపాలరావు, సీతారామరాజు, బాలు యాదవ్, ఆంజనేయులు యాదవ్, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking