అతనొక్కడే…అనితర సాధ్యుడు

అతనొక్కడే…అనితర సాధ్యుడు

సింగిల్ గానే ప్రచారం… భారీ మెజార్టీ

బీఎల్ఆర్ కు ప్రజా ఆశీర్వాదం

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

టిక్కెట్ ఊగిసలాట. చివరి అంఖంలో టిక్కెట్ ఖరారు. సొంత పార్టీలోనే కుంపటి. అగ్ర నేతలేవరూ ప్రచారానికి రాలే. పోలింగ్ కు రెండు రోజుల ముందే తల్లి కన్నుమూత. ఇంతటి విపత్కర, ప్రతికూల పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యం… దీక్ష… సేవ… అతన్ని అందలమెక్కించింది. అత్యంత మెజార్టీతో మిర్యాలగూడ ప్రజలు మిర్యాలగూడ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్ధి బత్తుల లక్ష్మారెడ్డికి పట్టం కట్టారు. మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ప్రచారానికి జాతీయ, రాష్ట్ర నాయకులేవరు రాకున్నా ఒక్కడే జిల్లా, నియోజకవర్గ నాయకులతో ప్రచారం చేసి 48,782 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడం అభినందించదగ్గ విషయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ప్రత్యర్థి అయిన బిఆర్ఎస్ అభ్యర్ధి నల్లమోతు భాస్కర్ రావు ప్రచారంలో భాగంగా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు, అప్పటి సీఎం కేసిఆర్ తో భారీ బహిరంగసభ నిర్వహించడం జరిగింది. అనంతరం బిఆర్ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, అప్పటి మంత్రి కేటీఆర్ మిర్యాలగూడలో భారీ జనం మధ్య రోడ్ షో నిర్వహించారు. ఐతే బిఎల్ఆర్ నామినేషన్ సమయంలో తుంగపాడు గ్రామం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు10 కిలోమీటర్లు భారీ పాదయాత్ర తప్ప వార్డుల్లో జనంతో గుంపులు గుంపులుగా ప్రచారం చేశారు. డబ్బు విషయలో అధికార పార్టీకి పోటీ పడలేకపోయారు. అతను పది రూపాయలు ఇస్తే ఇయన 5 రూపాయలు, తండాలకు బరాబర్ గా పొట్టెల్లు ఇచ్చారు. సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి ప్రచారానికి ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఏచూరి సీతారాం రోడ్డు షోకు వచ్చారు. అయితే బిఎల్ఆర్ నియోజకవర్గానికి 3 దిక్కుల సీఎం పదవి కోరుకునే నాయకులున్నా ఒక్కరోజు కూడ మిర్యాలగూడ వైపు చూడనే లేదు. 2018 శాసన సభ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి ఆర్.కృష్ణయ్యకు సినీ నటి విజయశాంతి, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించినప్పటికి సుమారు 52 వేల ఓట్లు రాగా నేడు ఎలాంటి అగ్ర నాయకులు లేకుండా ప్రచారం నిర్వహించి 1,14,462 ఓట్లు పొంది 48,782 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం గొప్ప విషయo. మొత్తమ్మీద ఒక్కడే వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించడం వల్ల ఎన్నో ఎన్నికలు నిర్వహించిన ఉద్దండుడు అయిన భాస్కర్ రావును ఢీ కొని భారీ మెజారిటీతో గెలుపొందడం బిఎల్ఆర్ ఘనతే నంటున్నారు.

కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యేగా

సామాజిక సేవకుడికి పట్టం

సామాజిక సేవల్లో కొంత కాలంగా ప్రజలకు చేరువైన బత్తుల లక్ష్మారెడ్డికి మిర్యాలగూడ ప్రజలు పట్టం కట్టారు.మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఎన్నికైన బత్తుల లక్ష్మా రెడ్డి జిల్లా రాజకీయ నేతల్లో ప్రత్యేకత చాటుకున్నారు. వారసత్వ నేపథ్యం, సుదీర్ఘ రాజకీయ అనుభవం లేనప్పటికీ మొదటిసారిగా 2023 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి 48 వేలపై మెజారిటీ సాధించి సునామి సృష్టించాడు. కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులెవరు ప్రచారానికి రానప్పుటికీ, రాజకీయ చాణక్యుడైన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుపై భారీ మెజారిటీ సాధించడం విశ్లేషకులకి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. నాలుగేండ్ల క్రితం బీఎల్ఆర్ బ్రదర్స్ పేరుతో మజ్జిగ పంపిణీ, అన్నదాన కార్యక్రమాల ద్వారా సామాజిక సేవకుడిగా మిర్యా లగూడ ప్రజలకు చేరువయ్యాడు బీఎల్ఆర్. సేవే పెట్టుబడిగా 2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి తన ఇమేజ్ తో మరో 20 మంది కౌన్సిలర్లను గెలిపించి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికయ్యాడు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం చేసిన బీఎల్ఆర్ అప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన అమరేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ లతో పోటీపడి జానారెడ్డిలాంటి సీనియర్ నేతలను ఒప్పించి పార్టీ అభ్యర్థిగా బీ ఫారం తెచ్చుకోవడం చరిత్రగా మారింది. బీఎల్ఆర్ కాంగ్రెస్ బీ ఫార్మ్ తెచ్చుకోవడంతోనే ఆయన గెలుపు ఖాయమైంది. సేవాతత్పరతకు ప్రజలు తమ విలువైన ఓటు ద్వారా అధికారం కట్టబెట్టి రుణం తీర్చుకున్నారు. ప్రజలు కట్టబెట్టిన పదవితో మరిన్ని సేవలందించాలని ఆశిద్దాం.

Leave A Reply

Your email address will not be published.

Breaking