అదైర్యపడొద్దు… అండగా ఉంటా
బీఆర్ఎస్ పటిష్టతకు కృషి చేయాలి
మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
బిఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తాజా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కోరారు. సోమవారం మిర్యాలగూడ పట్టణం వైదేహి వెంచర్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో భాస్కర్ రావు విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అధైర్య పడకుండా పార్టీ అభివద్ధికి పాటు పడాలని కోరారు.


సమావేశంలో మునిసిపల్ చైర్మన్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరునగరు భార్గవ్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, నాయకులు నల్లమోతు సిద్ధార్థ లు పాల్గొన్నారు.