క్విజ్ మొదటి బహుమతి పొందిన కిరణ్
కొడంగల్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఇగ్నిటి ఫెస్ట్ కాంపిటీషన్స్ లో వ్యాసరచన, వకృత్వ పోటీలు, చర్చ, స్పెల్ బీ,కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ శారద వెంకటేష్, కొడంగల్ ప్రిన్సిపాల్ కె చంద్రశేఖర్ రెడ్డి వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమాలలో 16 గురుకుల పాఠశాలలకు సంబంధించినటువంటి 350 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కొడంగల్ కు సంబంధించినటువంటి విద్యార్థులు కిందిగేరి కిరణ్ కుమార్ క్విజ్ కాంబినేషన్లో మొదటి బహుమతి పొందడం జరిగింది.వంశీకృష్ణ రెండవ బహుమతి పొందడం జరిగింది.
హిందీ వకృత్వ పోటీలలో వరుణ్ సందేశ్ మొదటి స్థానంలో బహుమతి పొందడం జరిగింది.ఇగ్నైట్ ఫెస్ట్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో ఉన్నటువంటి వాక్చాతుర్యాన్ని మేధస్సును పెంపొందించేదిగా , నైపుణ్యాలు పెంపొందించేదిగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దీనివల్ల విద్యార్థులు మరింత ఉత్సాహంగా చదవడానికి ఉపయోగపడతాయని అర్సిఓ శారద వెంకటేష్ తెలపడం జరిగింది.