ఎంపిహెచ్ డబ్ల్యు ఫలితాల్లో ఖమ్మం మహిళా ప్రాంగణం ప్రభంజనం
-రాష్ట్ర స్థాయిలో 2 వ 4 వ స్థానాలు కైవసం
-జిల్లా స్థాయిలో 1 నుండి 10 ర్యాంకులు కైవసం
-వేల్పుల విజేత
మహిళా ప్రాంగనాధికారిణి
ఖమ్మం/అక్షిత బ్యూరో :
మహిళా ప్రాంగణం అంటే మహిళలకు కుట్లు అల్లికలు కంప్యూటర్ కోర్సు నేర్పే ప్రభుత్వ సంస్థ అనుకునేవారు ఇదివరకు కానీ 2022 వ సంవత్సరం నుండి మహిళా ప్రాంగాణాల్లో 2 సంవత్సరాల ఎంపిహెచ్ డబ్ల్యు నర్సింగ్ కోర్సు ను ప్రవేశపెట్టారు.రాష్ట్ర స్థాయి లో అన్ని జిల్లాలో కాకుండా ఖమ్మం వరంగల్ ఆదిలాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ ల కింద ఈ కోర్సు ను ప్రవేశ పెట్టగా ఒక సంవత్సరం పూర్తయి రెండవ సంవత్సరం కోర్సు నడుస్తుంది.ఈ మొదటి సంవత్సర ఫలితాల్లో ఖమ్మం మహిళా ప్రాంగణం కు రాష్ట్ర స్థాయి లో 2 వ 4 వ ర్యాంకులు సాధించి అగ్ర భాగాన నిలిచింది.అంతే కాకుండా జిల్లా స్థాయి లో మొదటి పది ర్యాంకులు కూడా మహిళా ప్రాంగణం విద్యార్థులే సాధించడం విశేషం.ఖమ్మం తో పాటు ప్రారంభించిన ఆదిలాబాద్ వరంగల్ మహిళా ప్రాంగణంలలో కూడా 100% ఫలితాలు సాధించి విజయ డంకా మోగించారు.

చాలా ఆనందంగా ఉంది
-వేల్పుల విజేత
మహిళా ప్రాంగణం అధికారిణీ
మా ఖమ్మం మహిళా ప్రాంగణం లో చదివే పిల్లలు అందరూ మారుమూల ఏజెన్సీ ప్రాంత వాసులే వారికి మేము మంచి విద్య భోజన సదుపాయం కల్పించాం.పిల్లలను తెల్లవారుజామునే లేపి చదివించే వాళ్లం.నిరంతరం వారి ప్రగతి ని పర్యవేక్షించే వాళ్లం.మంచి ర్యాంకులు వస్తాయి అనుకున్నాం కానీ రాష్ట్ర స్థాయిలో 2, 4 ర్యాంకుల ను ఊహించ లేదు.

చాలా ఆనందoగా ఉంది.

తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో స్త్రీ శిశు సంక్షేమ సంచాలకులు దివ్య సహకారంతో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు మరియు నేటి స్త్రీ శిశు సంక్షేమ కార్యదర్శి వాకాటి కరుణ సహకారంతో ఇప్పటి మా సంచాలకులు నిర్మల క్రాంతి వెస్లీ ప్రోత్సాహం తో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ప్రోత్సాహంతో మా శాఖా ఎజీఎం పద్మావతి మేనేజర్ విజయ శ్రీ నిరంతర పర్యవేక్షణలో మేము ఈ రకం గా స్టేట్ ర్యాంకు లు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు.దీన్ని ఇకపై కూడా నిలుపుకుంటాము అని ఈ సందర్భంగా తెలిపారు.