మేడిగడ్డ పాపం బిఆర్ఎస్ పార్టీదే
– ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది బీర్ఎస్
– బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు
– నిరుద్యోగుల పాపం బిఆర్ఎస్ పార్టీదే
– 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు
– ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిన పాపం బీర్ఎస్ దే
– కాంగ్రెస్ జిల్లా నాయకులు పూస బాలకిషన్
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజీ బిఆర్ఎస్ పార్టీ అవినీతి వల్లే జరిగిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పూస బాలకృష్ణ విమర్శించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఏఆర్ఎంబికి ప్రాజెక్టులను అప్పగింతకి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంటూ సంతకం చేసి ఈరోజు ప్రజలని తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతుందని అన్నారు.మాజీ సీఎం కేసిఆర్ నల్లగొండ సభలో మాట్లాడిన తీరు దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని విమర్శించారు. గత తొమ్మిది సంవత్సరంలో బిఆర్ఎస్ హయాంలో అనేక ప్రభుత్వం పాఠశాలలు మూత పడ్డాయని, లేక ఉంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశతో ఎదురు చూశారని అన్నారు.పేరుకే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిన బోధించడానికి ఉపాధ్యాయులు లేక గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో టిఆర్ఎస్ పార్టీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, రాష్ట్ర ప్రజలను అప్పుల పాలు చేసిందని విమర్శించారు.లక్షలాదిమంది నిరుద్యోగులు కష్టపడి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు వెచ్చించి పరీక్షలు రాస్తే పేపర్ లీకేజీలతో అనేకమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ పాపం బిఆర్ఎస్ పార్టీదేనని అన్నారు.9 ఏళ్ల పాలనలో నిరుపేద కుటుంబాలకు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకోనే ప్రయత్నం చేస్తుందని, తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీని నమ్మబోరని తెలిపారు. 9 ఏండ్ల పాలనలో సూపర్ అనేక తప్పిదాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని, మోసం చేసిన పార్టీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2నెలలు పూర్తి కాలేదు అప్పుడే మా ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద నిందలు వేయడం సిగ్గు చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని తెలిపారు.