అనితర సాధ్యుడు… సంక్షేమ సారధి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

అనితర సాధ్యుడు… సంక్షేమ సారధి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
పేటలో ఘనంగా బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

– సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ ఆధ్వర్యంలో 1000 మందికి అన్నదానం

సూర్యాపేట /అక్షిత ప్రతినిధి :
అనితర సాధ్యుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గొప్ప నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ప్రముక వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ లు అన్నారు.సంక్షేమ సారధి, పేదల పెన్నిధి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక పొట్టి శ్రీరాములు సెంటర్లో 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అందజేసి దేశానికి దిక్సూచిగా తెలంగాణను తీర్చిదిద్దారని అన్నారు.* తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా చేయూతనిచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 14ఏళ్ళు పోరాటం చేసి సావు అంచులకు వెళ్లి సాధించుకున్న తెలంగాణను గత పదేళ్ల కాలంలో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాడనీ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ జన్మదినోత్సవన్ని పురస్కరించుకొని మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కుడి భుజంగా ఉన్న మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి మనందరికీ అండగా ఉన్నారని ఆయన మార్గదర్శనంలో మనమంతా ముందుకు సాగుదాం అన్నారు. ప్రజల దీవెనలే కెసిఆర్ కు శ్రీరామరక్ష అని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కౌన్సిలర్ల ఆకుల లవకుశ, చింతలపాటి భరత్ మహజన్, బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, జిల్లా నాయకులు బత్తుల రమేష్, సుంకరి రమేష్, వెంపటి సురేష్, సల్మా మస్తాన్, కరుణ శ్రీ,, గోనె అశోక్, శిరపంగి నాని తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking