యువనేత సిద్దార్థ పుట్టినరోజు వేడుకలు

యువనేత సిద్దార్థ పుట్టినరోజు వేడుకలు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణంలోని వైదేహి టౌన్ షిప్ లో బీఆర్ఎస్ యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్దార్థ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్లమోతు భాస్కర్ రావు (ఎన్బీఆర్ ) ఫౌండేషన్ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు, ఉపాధి కోసం నల్లమోతు సిద్దార్థ అలుపెరుగని శ్రామికుడిలా కృషి చేస్తున్నారని కితాబిచ్చారు.

లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో అనేక కుటుంబాలను అక్కున చేర్చుకున్న గొప్ప మానవతావాది నల్లమోతు సిద్దార్థ అని కొనియాడారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో జర్నలిస్టుల కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారని చెప్పారు. మిర్యాలగూడ నియోజకవర్గ యువతకు నల్లమోతు సిద్దార్థ మార్గదర్శిగా నిలిచారని అన్నారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ నిరుద్యోగ యువత కుటుంబాల్లో వెలుగులు నింపుతోందన్నారు. నల్లమోతు సిద్దార్థ నిండు నూరేండ్ల ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, సుఖసంతోషాలతో విజయపథంలో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తీరంశెట్టి కోటేశ్వర రావు, శ్రీనివాస్, వజ్రం, దినేష్,
నాగరాజు,  గంగాధర్, క్రాంతి, శ్రీనివాస్,మహేష్, శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking