అమ్మానాన్న అనాధాశ్రమంలో అన్నదానo
రాజిరెడ్డి పుట్టినరోజు వేడుకలు..
నకిరేకల్ అక్షిత ప్రతినిధి
కాంగ్రెస్ జిల్లా నాయకులు, పల్లివాడ మాజీ సర్పంచ్ గంగుల వెంకట రాజారెడ్డి పుట్టినరోజు సందర్భంగా చౌటుప్పల్ లోని అమ్మానాన్న ఆశ్రయంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ నాయకులు కేస కిరణ్, నర్సిరెడ్డి, ఎటెల్లి పరమేష్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రమంలో జిల్లా నాయకులు జీనుకల ప్రభాకర్ పూస బాలకిషన్, పున్న జగన్ నంద్యాల బిక్షం రెడ్డి, గోదాసు భాస్కర్ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.