సంస్కృతి ఉట్టి పడేలా… అమెరికాలో బతుకమ్మ

సంస్కృతి ఉట్టి పడేలా… అమెరికాలో బతుకమ్మ

అమెరికాలో🇺🇸 ఘనంగా  బతుకమ్మ వేడుకలు

న్యూఢిల్లీ, అక్షిత ప్రత్యేక ప్రతినిధి :

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఖండాంతరాలు దాటాయి. సంస్కృతిని ప్రతిబింబించేలా అమెరికాలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. అమెరికాలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో  పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా అమెరికాలోని చార్లెట్ నగరంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వందలాది మంది మహిళలు వచ్చి బతుకమ్మ వేడుకలలో పాల్గొని ఆడి పాడారు.తెలంగాణ అమెరికా తెలుగు సంఘం చార్లెట్ అధ్యక్షులు  నవీన్ రెడ్డి మలిపెద్ది,  డైరెక్టర్లు నిశాంత్ సిరికొండ, శ్రీకాంత్ గాలి, అభిలాష్ ముదిరెడ్డి, శివ కారుమూరు, దిలీప్ రెడ్డిల పర్యవేక్షణలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గోదావరి రెస్టారెంట్ నిర్వాహకులు అభిలాష్ ముదిరెడ్డి, ప్రవీణ్ మన్నెం బతుకమ్మ వేడుకల స్పాన్సర్లుగా, తెలంగాణ రుచులతో, కమ్మని వంటకాలతో స్టాల్ ను కూడా ఏర్పాటు చేశారు.బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు, బండి యాదగిరి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking