– మార్కెట్ యార్డులో 𝟕𝟔వ గణతంత్ర వేడుకలు నిర్వహించిన నూతన కమిటీ.
కమలాపూర్. జనవరి 𝟐𝟔 అక్షిత ప్రతినిధి:
కమలాపూర్ మండల కేంద్రం లోని గణతంత్ర దినోత్సవం సందర్భంగా కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేశారు.ఈ సందర్భంగా ఝాన్సీ రాణి మాట్లాడుతూ భారత రాజ్యాంగం కన్నా గొప్ప గ్రంథం ఏదీ లేదని డా,, బి.ఆర్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగం అమలైన రోజు కన్న గొప్ప పండుగ ఏదీ లేదని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన విధంగా భారతదేశంలో కుల మత స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ సమానంగా ఉండాలని ఆమె ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య డైరెక్టర్ లు సముద్రాల కృష్ణ, గట్టు శ్రీధర్,జనగాని శివకృష్ణ, వంటకాల అనిల్ రెడ్డి, చకిలం దయాకర్, యాకోబు పాష,నెగ్గుల లింగయ్య, కిన్నెర కృష్ణమూర్తి, అకినపల్లి బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్లూరి శ్రీనివాసరావు శనిగరం రమేష్ అనిల్ శివ సునీల్ మార్కెట్ సూపర్వైజర్ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.