కొరిపల్లి శ్రీనివాస్ కు “డాక్టరేట్”

కొరిపల్లి శ్రీనివాస్ కు “డాక్టరేట్”

వేద సంహిత మెమోరియల్ ట్రస్ట్” ద్వారా చేసిన సేవలకు “న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ” నుండి డాక్టరేట్ ప్రధానం

ఖమ్మం /అక్షిత బ్యూరో :

హైదరాబాద్ రవీంద్రభారతిలో సోమవారం సాయంత్రం డాక్టరేట్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. “వేద సంహిత మెమోరియల్ ట్రస్ట్” ద్వారా చేసిన సేవలకు గాను గుర్తింపునిచ్చి న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ ఫౌండర్ బిషప్ పాలంగి జోసెఫ్ వారి ద్వారా కొరిపల్లి శ్రీనివాస్ కు డాక్టరేట్ ను ప్రధానం చేసినారు. కొరిపల్లి శ్రీనివాస్ ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామానికి చెందిన కొరిపల్లి వెంకయ్య, వెంకటమ్మల 13వ సంతానంగా జన్మించారు. చదువుల నిమిత్తం ఖమ్మం వెళ్లి స్థిరపడి, జహీర్ పుర గుట్టలబజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొరిపల్లి శ్రీనివాస్ కు ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు. రెండవ సంతానం కూతురు వేద సంహిత ఐదు సంవత్సరాల క్రితం మరణించినారు. ప్రేమగా పెంచుకున్న కూతురు చనిపోవడంతో ఆమె పేరు మీద సహాయం చేయాలని “వేద సంహిత మెమోరియల్ ట్రస్ట్” ఏర్పాటుచేసి ఆ ట్రస్టు ద్వారా చేసిన సేవలకు గాను గుర్తింపునిచ్చి “న్యూలైఫ్ థియలాజికల్ యూనివర్సిటీ” నుండి “యూనివర్సిటీ ఫౌండర్ బిషప్ పాలంగి జోసెఫ్” ద్వారా కొరిపల్లి శ్రీనివాస్ కు డాక్టరేట్ ను ప్రధానం చేసినారు. డాక్టరేట్ ప్రధానం చేసిన బిషప్ పాలంగి జోసెఫ్ వారికి శ్రీనివాస్ దన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కొరిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టరేట్ ప్రధానంతో మరింత సేవలు చేయుటకు బాధ్యతను పెంచిందన్నారు. కొరిపల్లి వెంకయ్య, వెంకటమ్మ వేద సంహిత (కెవివివి) మెమోరియల్ ట్రస్టు ద్వారా వారి జ్ఞాపకార్థంగా సేవ చేయటం తద్వారా మంచి గుర్తింపురావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking