అక్షిత అక్షరం… ప్రజాయుధం
అక్షి దిన పత్రిక నూతన క్యాలెండరు 2025ను ఆవిష్కరించిన…
జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్…
జనగామ జిల్లా అక్షిత జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వనమైన వెంకటేష్ గౌడ్…
జనగామ, అక్షిత ప్రతినిధి:
రాష్ట్రంలో గత 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న అక్షిత దిన పత్రిక ప్రజల పక్షాన నిలబడి వార్తలను అందించడం జరుగుతుందని… ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో హర్షినీయమని… జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారము అక్షిత దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్… అక్షిత జనగామ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వనమైన వెంకటేష్ గౌడ్ ల ఆధ్వర్యంలో జనగామ కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ…. ప్రజాస్వామ్య భారతదేశంలో దిన పత్రికల పాత్ర ఎంతో ఉందన్నారు. రాష్ట్రంలో గత15సంవత్సరాలుగా కొనసాగుతున్న అక్షిత దిన పత్రిక ప్రజల పక్షాన వార్తలను ప్రచురించడం హర్షనీయమన్నారు.

ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభంగా… మీడియా రంగం ఉందని… తన పాత్రను సక్రమంగా నిర్వహించడంలో…ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రజా సంబంధాల అధికారి శ్రీనివాస్, నాయకులు టీపీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దూడల సిద్దయ్య గౌడ్, జనగామ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నామాల శ్రీనివాస్ గౌడ్, ముత్యాల సుధాకర్, చామకూర చిరంజీవిలు, సీనియర్ జర్నలిస్టులు పాలమాకుల జితేందర్, బత్తిని అశోక్ గౌడ్, కట్ట రవికుమార్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.