అక్షిత అక్షరం… ప్రజాహితం
రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ సీఎండి ఎస్ఎస్ రాజు
తార్నాక, అక్షిత ప్రతినిధి :
ప్రజలకు… ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజాహితంగా పరిడవిల్లుతుందని అక్షిత తెలుగు జాతీయ దినపత్రిక ముందుకు సాగుతుందని రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజు ఆకాంక్షించారు. గురువారం తార్నాకలోని రాజా ఇన్ ఫ్రాడెవలపర్స్ ప్రధాన కార్యాలయంలో అక్షిత తెలుగు జాతీయ దినపత్రిక చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగితో కలిసి 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా ..ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా అక్షిత అక్షర యజ్ఞం సాగిస్తుందన్నారు. నిజాలను నిర్భయంగా… స్వేచ్ఛగా రాస్తూ ప్రజల సమస్యలకు వాస్తవ దర్పణం పడుతుందన్నారు.

వివిధ ప్రధాన స్రవంతి కల్గిన పత్రికల్లో విశిష్ట సేవలందించిన అనుభవంతో చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి సారథ్యంలో గత పదిహేనేళ్లుగా అక్షిత అక్షర సమరం మోగిస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. వాస్తవాలకు దర్పణం పట్టేలా అక్షిత అక్షర సమరం సాగిస్తుందన్నారు. అనతి కాలంలోనే పాఠకుల ఆదరణను చూరగొని ప్రధాన స్రవంతి కల్గిన పత్రికలకు ధీటుగా అక్షిత వెలుగొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి రజిని, టీం లీడర్ స్నేహ, నీరజ, తేజ పాల్గొన్నారు.