బచ్చన్నపేటలో మతిస్థిమితం లేని వ్యక్తి హత్య… ?
నర్మెట సీఐ అబ్బయ్య…!!
జనగామ/ బచ్చన్నపేట, అక్షిత ప్రతినిధి:
బచ్చన్నపేట మండల కేంద్రంలో శుక్రవారం మతిస్థిమితం లేని వ్యక్తిని హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. నర్మేట సిఐ అబ్బయ్య తెలిపిన వివరాల ప్రకారం… మృతుడు బత్తుల అలియాస్ దొంగ నర్సిరెడ్డి అలియాస్ రాజిరెడ్డి, తండ్రి రామ్ రెడ్డి, వయసు 52 సంవత్సరాలు, షారాజీపేట గ్రామం ఆలేరు మండలం… చిన్నతనం నుండి మానసికంగా మెంటల్ వ్యాధితో బాధపడుతూ… పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడు అప్పటినుండి ఎవరు పట్టించుకోకపోయేసరికి కొన్ని రోజులు వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెంబర్తిలో ఉన్నాడు… గత 25 సంవత్సరాల నుండి బచ్చన్నపేటకు వచ్చి మతిమితం లేక షాపుల వద్ద అడుక్కుంటూ… బస్టాండ్ సెంటర్లో గల ఉబేద్ యొక్క నూతన నిర్మాణం లో ఉన్న బిల్డింగ్ లో రాత్రి సమయంలో పడుకునేవాడు.

నిన్నటి రోజు రాత్రి అదే బిల్డింగ్ లో హత్యకు గురి కాగా… ఈ విషయం తెలుసుకొని శుక్రవారం రోజున ఉదయం 08:00 గంటలకు ఫిర్యాదురాలు అతని భర్తతో కలిసి బచ్చన్నపేట సెంటర్లో ఉన్న ఉబేద్ బిల్డింగ్ వద్దకు వచ్చి చూసేసరికి అతని మృతుడుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి చంపివేసి ఉంటారని సంఘటన స్థలానికి వచ్చి చూడగా ముఖం చింద్రమై ఉండి మెదడు బయటికి వచ్చి దారుణంగా హత్య గురై చనిపోయి ఉన్నాడు. ఫిర్యాదు మృతుడి యొక్క చెల్లెలు వరలక్ష్మి, భర్త వెంకటరెడ్డి, గ్రామం ఆలింపూర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సంఘటన స్థలానికి బచ్చన్నపేట ఎస్సై హమీద్ నర్మెట్ట సీఐ అబ్బయ్య సిబ్బంది తోపాటు హాజరై విచారణ చేపట్టారు. డాస్కోడ్ క్లూస్ టీం ని పిలిపించి సంఘటన స్థలాన్ని పరిశీలించారు, తదుపరి మృతదేయాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.