18 నెలలు…18 పథకాలు..18 రోజులు 

18 నెలలు…18 పథకాలు..18 రోజులు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ప్రజా ప్రభుత్వం గడిచిన 18 నెలల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంగా 18 నెలలు, 18 పథకాలు, 18 రోజులు అనే కార్యక్రమంతో మాడుగులపల్లి, అడవిదేవులపల్లి మండలాల్లోని ప్రతీ గ్రామానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 18 నెలల పాలన సమయంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందిస్తూ ప్రజాపాలన సాగిస్తున్న దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అయ్యామని అన్నారు. సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రతీ గ్రామాన గడప గడపకు తీసుకెళ్లి ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలను ప్రజలకు వివరించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.

కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, నాయకులు పొదిల శ్రీనివాస్, డిసిసి ప్రధాన కార్యదర్శి నాగునాయక్, మాజీ సర్పంచ్ సూర్నాయక్, గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking