సింహపురి కాలనీ చెరువుని అభివృద్ధి చేయండి

సింహపురి కాలనీ చెరువుని అభివృద్ధి చేయండి

ఆకుల సతీష్

మేడ్చల్,అక్షిత బ్యూరో :
దుండిగల్ మున్సిపాలిటీ, బౌరంపేట గ్రామం సింహపురి కాలనీ నందు 1.80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బలిజవానికుంట (id:2863) నందు వర్షం/మురికి నీరు కలవడం మరియు బలిజవానికుంట నుండి రాంజీ కుంట వారికి తోపోషీట్లో నాలా స్పష్టంగా కనిపిస్తున్న నాలను పూడ్చి కొందరు కాంపౌండ్ వాల్ కట్టుకోవడం వల్ల నీళ్లు వెళ్ళకపోవడం వల్ల ప్రజలు దోమలు మరియు భూగర్భ జలాలు కలుషితమవడం మరియు చెరువు దగ్గర రోడ్లు డ్రైనేజ్ లైన్ సమస్య గత నాలుగు సంవత్సరాలుగా కాలనీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడంపై ఆదివారం ఆకుల సతీష్ ఆధ్వర్యంలో సింహపురి కాలనీ ప్రజలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించడమే కాకుండా సమస్యకు మూల కారణమైన ఇరిగేషన్ నాలాని తక్షణమే పునరుద్ధరించాలని మరియు సర్వేనెంబర్ 450 నందు ప్రభుత్వ భూమి 3.20 ఎకరాల్లో చెరువు విస్తీర్ణం పోను మిగతా ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి గుర్తించడమే కాకుండా చెరువు ఎఫ్ టి ఎల్ సరిహద్దులను ఏర్పాటు చేయాలని మిగిలిన ప్రభుత్వ స్థలంలో పార్క్ అభివృద్ధి చేయాలని మరియు చెరువులో మురికి నీరు కలవకుండా డైవర్షన్ చేసి నాలాలో కలపడం వల్ల భూగర్భ జలాలు కలుషితం కాకపోవడమే కాకుండా దోమల సమస్యను కూడా పరిష్కరించవచ్చని మరియు మిగిలిన రోడ్డు డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ మరియు మల్కాజిగిరి ఆర్డిఓ మరియు ఇరిగేషన్ డి ఈ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.

స్పందించిన అధికారులు మంగళవారం పూర్తిస్థాయిలో పరిశీలించే సర్వే చేయడమే కాకుండా, నాలాల పునరుద్ధరణ చెరువు అభివృద్ధి, మురుగు నీరు డైవర్షన్ డ్రైనేజీ లైన్ రోడ్ల సమస్యలను పరిష్కరించడం ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు నాలుగు సంవత్సరాల నుంచి ప్రజల సమస్యను విన్నవించిన పరిష్కరించలేదని, ఇప్పుడు పరిష్కరించకుంటే అధికారుల కార్యాలయాలు కాలనీ ప్రజలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, చందు, అశోక్ రెడ్డి
రామ్ కుమార్ ,శ్రీనివాస్ ప్రెస్ సత్యనారాయణ
రెడ్డి రవీంద్ర శేషు శ్రీహరి ఇతర కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking