ఐక్యతతోనే అధికారం

ఐక్యతతోనే అధికారం

బీసీలందరూ సంఘటితం కావాలి

వరంగల్, అక్షిత బ్యూరో:

ఐక్యతతోనే బీసీల రాజ్యాధికారం సాధ్యమని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. జన అధికార సమితి, ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి రాసిన ఓబీసీల పోరుబాట పుస్తక సమీక్ష కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ బీసీలందరూ చైతన్యమై.. ఏకం కావాల్సి ఉందని అన్నారు.బీసీలందరూ ఏకమైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీలకతీతంగా సంఘాలకతీతంగా బీసీ ఉద్యమం ఎక్కడ జరిగినా అక్కడ వినయ్ భాస్కర్ అండగా ఉంటారని తెలిపారు.బీసీ ఉద్యమాల్లో ఎప్పుడూ ముందుంటానన్నారు.నరహరి రాసిన ఓబీసీ ల పోరుబాట పుస్తకం బీసీలకు ఒక దిక్సూచిగా పనిచేస్తుందన్నారు. బీసీ ఉద్యమాలలో పాల్గొంటూనే హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ, ములుగు రోడ్డు ప్రాంతాల్లో పూలే విగ్రహ స్థాపనకు కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు.బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ అందరం కలిసి కట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు వన్నాల శ్రీరాములు సాంబార్ ఈ సన్మారావు ప్రసాదరావు, సతీష్ పలువురు వివర్ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking