నంగునూరు, అక్షిత ప్రతినిధి: తిమ్మాయిపల్లి గ్రామపంచాయతీలో పంచాయతీ సెక్రెటరీగా ఎండి గౌసోద్దీన్ తండ్రి సలీం గత ఐదు సంవత్సరాల నుండి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు, శనివారం ఉదయం 9:30 గంటల సమయంలో తన యొక్క విధుల్లో భాగంగా పంచాయతీ సెక్రెటరీ తన యొక్క ఫ్యాషన్ బైక్ వెహికల్ నెంబర్ ఏ పి 23 అర్ 1196 పై వైకుంఠధామం దగ్గరికి వెళ్లి బండి పార్క్ చేసి లోపలి కి వెళ్లి నర్సరీ పనులు చేసుకుంటుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సెక్రెటరీ యొక్క ఫ్యాషన్ బండిని పెట్రోల్ పోసి కాలబెట్టినారు అని సెక్రెటరీ గౌసోద్దీన్ ఫిర్యాదు మేరకు ఎస్సై రాజగోపాల్పేట కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనైనది అని తెల్పినారు.