యూరియా ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు.!

మిర్యాలగూడ ఆగస్టు 2, అక్షిత ప్రతినిధి: మిర్యాలగూడ మండలం మరియు పట్టణంలోని ఎరువుల దుకాణాలను శనివారం వ్యవసాయ శాఖ j ఇన్చార్జి ఎడిఎ డి.సైదానాయక్ మండల తహసీల్దార్ ఎస్. సురేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాటిలో భాగంగా డీలర్లు స్టాక్ రిజిస్టర్ నోటీస్ బోర్డులు విధిగా నిర్వహించాలన్నారు. రైతుల నుంచి ఆధార్ కార్డు తీసుకొని ఎరువులను ఈ పాస్ మిషన్ ద్వారా విక్రయించాలని సూచించారు. యూరియాను ఎమ్మార్పీకి మించి ఎక్కువ ధరకు అమ్మినట్లయితే ఎరువుల యాక్ట్ ప్రకారం తగిన కఠిన చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు. మండలంలో యూరియా తగినంతగా ఉందన్నారు. రైతులు ఎవరూ కూడా యూరియా గురించి ఆందోళన చెంద వలసిన అవసరం లేదని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking