సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నెరవేర్చాలి – గోపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండి సాయన్న గౌడ్

చిట్యాల, అక్షిత న్యూస్: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం వద్ద గౌడ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోపా) ఆధ్వర్యం లో ఆదివారం చిట్యాల పట్టణ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గోపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండి సాయన్న గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 18 వ తారీఖున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించాలన్నారు. అంతేకాకుండా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను, పోరాట స్ఫూర్తిని రగిలించేలా రాష్ట్రంలోని ప్రతి ఒక్క గౌడ బిడ్డ గర్వంగా ఉండాలని అన్నారు. గౌడ్స్ ఐక్యత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. పేద గౌడ విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా వారి యొక్క భవిష్యత్తు కోసం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎలిమకంటి మీరయ్య గౌడ్, రాష్ట్ర నిర్వాహ కార్యదర్శి సాయి వేణు గౌడ్, రంగారెడ్డి జిల్లా నకరికంటి శ్రీనయ్య గౌడ్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు దంతూరి సైదులు గౌడ్, చిట్యాల పట్టణ అధ్యక్షుడు మారగోని రమేష్ గౌడ్, చిట్యాల పెద్ద గౌడ్ మేకల శివ గౌడ్,, కోశాధికారి రేగులగడ్డ నరసింహ గౌడ్, గౌరవాధ్యక్షుడు పుల్లెంల కోటయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు, ఉయ్యాల మల్లేష్ గౌడ్, బాలగోని లింగయ్య గౌడ్, కూనురు మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking