అంగన్వాడీ టీచర్స్ ను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తించాలి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి: అంగన్వాడీ టీచర్స్ ను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తించాలని ఐఎన్టీయు జిల్లా అధ్యక్షుడు అంబటి సోమయ్య కోరారు. ఆదివారం స్థానిక ఎన్ఎస్పి క్యాంపు యుపిఎస్ లో ఇందిర ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయుసి) మిర్యాలగూడ ఐసీడిఎస్ ప్రాజెక్టు యూనిట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రేట్యూటీ చెల్లించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలో చేర్చుకుంటున్నారని అడ్డుకోవాలని సోమయ్య కోరారు. మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం టీచర్ కు రూ. 18,000లు గౌరవ వేతనం చెల్లించాలని ఐఎన్టీయుసి జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు ఎండి.మొయినుద్దీన్ కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు రూ. 2లక్షలు, ఆయాకు లక్ష రూపాయలివ్వాలని, రిటైర్మెంట్ వయస్సు 65 నుండి 60కు తగ్గించాలని కోరారు. సర్వీస్ ఆధారంగా టీచర్లకు సూపెర్వైసర్ పదోన్నతి కల్పించాలని కోరారు. ఐఎన్టీయుసి చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పరికే వెంకటేశ్వర్లు, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూలకంటి మల్లీశ్వరి, విజయ, నాగమణి, పద్మావతి, రాజేశ్వరి, గౌసియా, రేష్మ, లక్ష్మిబాయి, మాధవి సరళ, చంద్రకళలు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking