మహిళల పథకాలను వెంటనే అమలు చేయాలి.!

  • మహిళల పథకాలను వెంటనే అమలు చేయాలి
  • మహిళా రైతు కూలీలతో పొలంలో సిపిఐ నిరసన

మిర్యాలగూడ/దామరచర్ల, అక్షిత ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం ఒక వైపు నిత్యావసరాల ధరలు పెంచుకుంటూ పోతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆత్మీయ భరోసా మహాలక్ష్మి పథకాలు అమలు చేయకపోవడం వల్ల పేదలు పేదలుగానే ఉంటున్నారని దామరచర్ల మండల సిపిఐ కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం దామరచర్ల మండలంలోని కొండ్రపోల్ గ్రామ మహిళ రైతు కూలీలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిత్యవసరాల దరలు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయ భరోసా మహాలక్ష్మి పథకాలను వెంటనే అమలు చేయాలని పొలంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో మతం పేరు చెప్పుకుని మూడోసారి అధికారంలో వచ్చిన బిజెపి మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాదులను పెంచి పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలోనే 80 శాతం పైన ఉన్న పేద బడుగు బలహీన వర్గాలను వారి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదని సిపిఐ కార్యదర్శి ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. ఏది ఏమైనా వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలని లేని పక్షంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను సమీకరించి భారీ ఉద్యమాలకు శ్రీకారం చుడ్తామని ఉదయ్ కుమార్ హెచ్చరించారు. ఆత్మీయ భరోసా మహాలక్ష్మి పథకాలను వెంటనే అమలు చేసి పేదల ఖాతాలో డబ్బులు జమ చేయాలని సిపిఐ కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ధనావత్ బుజ్జి లలిత మంగ్లీ జూబ్లీ తమిళి రాణి సుధా సావిత్రి నాగమ్మ రాములమ్మ నాగమణి మమత ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking