జాతీయ రహదారిపై వెలగని వీధి దీపాలు..

  • జాతీయ రహదారిపై వెలగని వీధి దీపాలు
  • వీధి దీపాలు వెలగక.. కమ్ముకున్న చీకట్లు
  • అంధకారంలో జాతీయ రహదారి

గుడిపల్లి /పీఏ పల్లి, అక్షిత ప్రతినిధి: గత కొంతకాలంగా జడ్చర్ల…కోదాడ జాతీయ రహదారిపై వెలగక చీకట్లు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా గుడిపల్లి మండలంలోని జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై చిలుకమర్రీ స్టేజి సమీపంలో రహదారిపై ఏర్పాటు చేసిన వీధి దీపాలు వెలగక గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ ప్రజలు రాత్రి సమయంలో రోడ్డు దాటవేయాలంటే వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే విషయమై పలుమార్లు అధికారులకు తెలిపిన ఎలాంటి స్పందన లేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీధి దీపాలు వెలిగేలా, సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking