- స్తంభాలకు మూడు రంగుల స్పైరల్ లైట్లు
- గులాబీ నుంచి మూడు రంగులు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి: మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే అదే పార్టీ రంగు మారుతుంది. మిర్యాలగూడ ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ కు చెందిన నల్లమోతు భాస్కర్ రావు, మునిసిపల్ చైర్మన్ గా తిరునగరు భార్గవ్ ఉన్నపుడు పట్టణంలో ప్రధాన సాగర్ రోడ్డు డివైడర్ మధ్య ఉన్న బట్టర్ ఫ్లై విద్యుత్ స్థంబాలకు గులాబీ రంగు స్పైరల్ విద్యుత్ లైట్లు అలంకరించారు. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నేత బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ఎన్నిక అయ్యారు. బిఆర్ఎస్ కు చెందిన అప్పటి మునిసిపల్ చైర్మన్ భార్గవ్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయన కాంగ్రెస్ లో చేరే వరకు గులాబీ స్పైరల్ లైట్లు వెలిగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండటం వల్ల ఆయనను మంచి చేసుకునే యత్నంలో మూడు రంగుల స్పైరల్ లైట్లు ఏర్పాటు చేశారు. మొత్తం అధికారం మారడంతో లైట్ల రంగులు కూడ మారాయి.