మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తిరుమల గిరిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ఆదివారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు.మధ్యాహ్నం విద్యార్ధినిల కోసం వండిన ఆహారంను పరిశీలించారు. మెనూ గురించి వాకబు చేశారు.ఆదివారం బగారా రైస్, చికెన్ పెడుతున్నట్లు తెలిపారు. వంట గదిని పరిశీలించారు. వంట గది పరిశుభ్రంగా లేకపోవడం గమనించి శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. భోజనం చేయడానికి వచ్చిన విద్యార్థినులతో మాట్లాడారు.”మౌలిక వసతులు, ఆహారం ఎలా ఉంది? రుచికరంగానే ఉందా? రోజు మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నారా? ఎలా చదువుతున్నారు?
డిగ్రీ తర్వాత ఏం చేద్దామని అనుకుంటున్నారు విద్యార్థినులను అడిగి వారి ఆలోచనలు తెలుసుకున్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్ గా నమోదు చేసుకోవాలని సూచించారు.
