శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి: హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఉషోదయ ఎన్క్లెవ్ కాలనీ వాసులు పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై పి ఏ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వివేకానంద నగర్ లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది.దీనిపై పి ఏ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించడం జరిగినది.ఈ సందర్భంగా ఉషోదయ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో మౌలిక వసతులు కలిపించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని, అదేవిధంగా కాలనీల లో అంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపర్చలని, అవసరమున్న చోట యూజీడీ పైప్ లైన్లు వేయాలని, వరద నీటి కాల్వ నిర్మాణము చేపట్టాలని , విధి దీపాలను ఏర్పాటు చేయాలని చైర్మన్ గాంధీ కి లిఖిత పూర్వకంగా వినతి పత్రం ద్వారా కోరడం జరిగినది.
ఈ సందర్భంగా పి ఏ సి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే ఉషోదయ ఎనక్లేవ్ కాలనీ లో పర్యటిస్తానని,ఉషోదయ కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల ను, డ్రైనేజి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని. త్వరలనే అవసరమున్న చోట రోడ్లను మరియు యూజీడీ పైప్ లైన్ లు ఏర్పాటు చేస్తామని, వరద నీటి కాల్వ నిర్మాణం చేపడుతామని, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరుస్తామని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల పనులను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని అన్ని పనులను దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, డ్రైనేజి వ్యవస్థను, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని పి ఏ సి చైర్మన్ గాంధీ తెలియచేసారు.కాలనీ లో అవసరమున్న చోట విధి దీపాలను ఏర్పాటు చేస్తామని, విధి దీపాలను సక్రమంగా వెలిగేలా చూడాలని అధికారులకు తెలియచేసారు. అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ,ఎల్లవేళల మీకు అందుబాటులో ఉంటానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని పి ఏ సి చైర్మన్ గాంధీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.