నాగార్జునసాగర్, అక్షిత ప్రతినిధి: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల మెరుగుపై అత్యవసర సమావేశం సోమవారం నిర్వహించనున్నారని మున్సిపల్ అధికారులు వెల్లడించారు. మున్సిపల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల మెరుగుపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
ఈ సమావేశానికి అధికారుల బృందం, ఏసి ఎల్ బి.సి ఈ ఓ మరియు బృందం, నైస్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఎంఎస్ఓ, పెద్దవూర, డి.ఎంహెచ్ఓ, డిప్యూటీ డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ డిటిడిఓ,డిడబ్ల్యూఓ., తహసీల్దార్,ఎంపిడిఓ, ఎంసి.డి పిఆర్.ఓ. పాల్గొననున్నారని వెల్లడించారు.
