ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి.!

సూర్యాపేట టౌన్, అక్షిత న్యూస్: అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి లు ఆకాంక్షించారు. ఆదివారం పట్టణంలోని సీతారాంపురం నాంచారమ్మ నగర్ లో కొలువైవున్న శ్రీశ్రీశ్రీ నాంచారమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేస్తున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. అనంతరం తాళ్లగడ్డ లోని శ్రీశ్రీశ్రీ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking