కేంద్రాలు సమగ్ర పారదర్శకంగా ఉండాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన చైర్మన్

కేంద్రాలు సమగ్ర పారదర్శకంగా సౌకర్యవంతంగా ఉండాలి

కేంద్రాలు ప్రతి రైతుకు సమయస్ఫూర్తి సేవ అందించాలి

కేంద్రాల వద్ద తూకం తేమ నాణ్యతను ఖచ్చితంగా పరిశీలించాలి

ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి

తిరుమలగిరి మార్కెట్ కమిటి చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్

నాగారం, అక్షిత న్యూస్ :- మండల పరిధిలోని పలు గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చామంతి నరేష్ ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధరను పొందాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రైతు తన కృషి, పాదం పెట్టిన ప్రతి గింజను తగిన మద్దతు ధర పొందే హక్కు కలిగిందని, అది ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారానే సాధ్యమని తెలిపారు. మధ్యవర్తుల ప్రలోభాలకు తలోగ్గవద్దని ధాన్యము కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయడానికి రైతుల సహకారం తప్పనిసరి అని, ధాన్యం నాణ్యత, తేమశాతం, తూకం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు కచ్చితంగా పరిశీలించబడాలని అన్నారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని, ప్రతి కేంద్రం సమగ్ర, పారదర్శక, సౌకర్యవంతమైన విధంగా పనిచేయాలని, రైతుల ఆత్మగౌరవం, కృషికి సరైన విలువ ఇవ్వడమే మా బాధ్యత అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన కొనసాగుతుండడంతో రైతుల సంక్షేమం, వ్యవసాయ ప్రగతికి ఈ విధమైన కొనుగోలు కేంద్రాల ద్వారా సక్రమమైన, సద్వినియోగ వ్యూహాలు అనుసరించడంలో విశేష కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రతి రైతు తాను ఉత్పత్తి చేసిన ధాన్యానికి తగిన హక్కును పొందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం, మార్కెట్ కమిటీలు, రైతుల కృషికి తగిన విలువను ఇస్తుందని, ఇది ఒక సమాజ, వ్యవసాయ అభివృద్ధి ఆర్థిక భద్రత కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ హరి కిషోర్ శర్మ, ఎంపీడీవో కె. మారయ్య, ఏవో కృష్ణ కాంత్, ఏపిఎం వెంకన్న, ఆర్ ఐ, సీసీలు, ఏఆర్వో కమిటీ మెంబర్లు, సంఘబంధం వివోఏలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking