భద్రంగా నడిపితే
భవితకు ఊతం
మీ చేతుల్లోనే
పిల్లల ప్రాణాలు
విద్యార్థుల ప్రాణ భద్రత
మనందరి బాధ్యత
నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి
నల్గొండ టౌన్, అక్షిత న్యూస్ :
మీ చేతుల్లోనే ..పిల్లల ప్రాణాలుoటాయి. భద్రంగా నడిపి.. భవితకు ఊతమివ్వాలని నల్గొండ డీఎస్పీ కే.శివరాంరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ సబ్ డివిజన్ లోని ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లకు అవగాహన కల్పించారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశానుసారం, నల్గొండ డిఎస్పి కే.శివరాం రెడ్డి నల్గొండ సబ్ డివిజన్ లోని అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లతో అవగాహన సదస్సును హెడ్ క్వార్టర్ లోని టిటిసి నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు గుర్తు చేస్తూ, ఈ ప్రమాదాలలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటనలు మనందరినీ కలిచి వేశాయన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల భద్రతకు సంబంధించి స్కూలు యాజమాన్యం డ్రైవర్ల ఎంపికలో సరైన రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు.

సీనియార్టీ ఉన్న డ్రైవర్లను నియమించాలని, డ్రైవర్ తో పాటు బస్సులో ఒకరు కేర్ టేకర్ ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా బస్ కు డాస్ బోర్డు కెమెరా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఏదేని ప్రమాదం జరిగితే ఎవిడెన్స్ లాగా పనికి వస్తుందని సూచించారు. పిల్లలు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. సమయ పాలన పాటించాలని, డ్రైవర్ నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. అదేవిధంగా బస్సులకు అన్ని డాక్యుమెంట్లు విధిగా ఉండాలని, నియమాలను ఎవరు ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల ప్రాణ భద్రత మనందరి బాధ్యత అని అందరికి గుర్తు చేశారు. తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపరాదని, నడిపితే వారిని పట్టుబడి చేసి జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు.

సెల్ ఫోన్ మాట్లాడుతూ పరధ్యానంతో వాహనం నడిపితే తప్పనిసరిగా ప్రమాదాలు అవుతాయని, జరిగే అనర్థాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమం అనంతరం డ్రైవర్ లతో కలిసి రోడ్డు భద్రతా నియమాల ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాఘవరావు, టూ టూన్ ఎస్సై సైదులు, జయాకర్, నల్గొండ రూరల్ ఎస్సై సైదాబాబు, ప్రైవేటు పాఠశాలల యజమానులు, డ్రైవర్లు సుమారు 150 మంది వరకు పాల్గొన్నారు.