పోలీసులకు చిక్కిన రియాజ్

పోలీసులకు
చిక్కిన రియాజ్

రియాజ్
మా అదుపులోనే

ప్రాణాలతోనే
చికిత్స పొందుతూ

జిల్లా సిపి సాయి చైతన్య వెల్లడి

నిజామాబాద్, అక్షిత ప్రతినిధి :

రౌడీ షీటర్ రియాజ్ పోలీసులకు చిక్కారు. సిసిఎస్ కానిస్టేబుల్ ను హత్య చేసి పరారైన రియాజ్ ను పోలీసులు వేటాడి పట్టుకున్నారు. ఆసిఫ్ ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటనలో ఇరువురి మధ్య పెనుగులాట జరిగి … ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే…నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ అడవి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో రౌడీ షీటర్ రియాజ్ హతమైనట్లు విస్తృతంగా వార్తలు వస్తున్నా నేపథ్యంలో, పోలీసులకు చిక్కినట్టు చిక్కి తప్పించుకునే ప్రయత్నం చేశారని దీంతో ఎన్కౌంటర్ చేశారని వార్తలు వెలువడుతున్నాయి.

అయితే ఈ వార్తలపై తాజాగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పందించారు. ఈ సందర్భంగా జిల్లా సీపీ సాయి చైతన్య విలేకరుల సమావేశంలో ఆదివారం రోజున మాట్లాడుతూ, నిందితుడు రియాజ్ పై ఇలాంటి కాల్పులు జరపలేదని, ప్రస్తుతం రియాజ్ ప్రాణాలతోనే ఉన్నారని, రియాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలియజేశారు. పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ముందే ఒక వ్యక్తితో రియాజ్ గొడవపడ్డాడు. ఆ గొడవలో రియాజ్ కు, గొడవపడ్డ వ్యక్తికి గాయాలు అయ్యాయని తెలియజేశారు. ప్రస్తుతము రియాజ్ కు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సిసిఎస్ కానిస్టేబుల్ ను రియాజ్ కత్తితో పొడిచి చంపేసిన విషయం విధితమే. నిజాంబాద్ లో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిందితున్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో బృందాలను ఏర్పాటు చేసి గాలించిన పోలీసులకు ఎట్టకేలకు ఆదివారం రోజున పోలీస్ బృందాలు రియాజును ఆదివారం రోజు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రియాజును పోలీసులు సవాలుగా తీసుకొని రెండు రోజుల్లోనే పట్టుకోవడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.

Breaking