చీకట్లను తరిమి
వెలుగును పంచి
దీపావళిని ఆనందంగా
జరుపుకోవాలి
కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్, అక్షిత బ్యూరో :
చీకట్లను తరిమి వెలుగును పంచడమే దీపావళి అని కలెక్టర్ మను చౌదరి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పర్వదినాన్ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఈ పండగ ప్రజల జీవితాల్లో మంచిని తీసుకురావడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆకాంక్షించారు. సోమవారం దీపావళి పండగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండగ అంటే దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా పండగను జరుపుతామని… అలాగే బాణసంచా విషయంలో పిల్లల పట్ల పెద్దలు అప్రమత్తత వహిస్తూ, దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసి ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాని కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.