స్మృతుల చిహ్నం…ఫోటోగ్రఫీ
భావాలకు భాష్యం
కీర్తి క్రియేషన్స్ డిజిటల్ స్టూడియో ప్రారంభోత్సవంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ నల్లగండ్ల మెయిన్ రోడ్ లో విజయ్ అధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కీర్తి క్రియేషన్స్ డిజిటల్ స్టూడియోను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ మనలోని భావాలకు భాష్యం చూపే కళ ఫోటోగ్రఫీ అని, ప్రతి క్షణాన్ని అందంగా స్మృతులుగా నిలిపే ఈ కళ సమాజానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. యువకులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావడం సంతోషకరమని, విజయ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కీర్తి క్రియేషన్స్ డిజిటల్ స్టూడియో మరిన్ని శాఖలకు విస్తరిస్తూ, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ రంగంలో మైలురాయిగా నిలవాలని ఆకాంక్షించారు.అదేవిధంగా యువత తమ ప్రతిభను సృజనాత్మకతతో మిళితం చేస్తూ స్వయం ఉపాధి మార్గాలను సృష్టించుకోవాలని, ఈ తరహా స్టార్టప్స్ ప్రోత్సాహకరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంత్ నాయక్, సీనియర్ నాయకులు అరుణ్ గౌడ్, స్థానిక నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.