యువత ఉపాధికి.. మెగా జాబ్ మేళా

యువత ఉపాధికి
  మెగా జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు
ఒక గొప్ప అవకాశం

25న హుజుర్ నగర్ లో
మెగా జాబ్ మేళా

మంత్రి ఉత్తమ్ చొరవతో
5 వేల మందికి ఉద్యోగాలు

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, అక్షిత ప్రతినిధి :

ఈనెల 25న హుజూర్ నగర్ లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన మెగా జాబ్ మేళా నిర్వహణపై అదనపు కలెక్టర్ కె. సీతారామారావుతో కలిసి సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి, కోదాడ ఎంఎల్ఏ ఉత్తమ్ పద్మావతిలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ నెల 25 న హుజూర్నగర్ లోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ( సబ్ రిజిస్టర్ కార్యాలయం వెనక) లో ఉదయం 8 గంటల నుండి జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ జాబ్ మేళాకు రాష్ట్రంలోని 150 పెద్ద, పెద్ద కంపెనీలు రానున్నాయని, 5000 వరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని ఆయన వెల్లడించారు. ఈ జాబ్ మేళాకు ఎస్ఎస్ సి, ఇంటర్, డిగ్రీ, పిజి, ఐటిఐ, డిప్లొమా, ఎంబిఏ, బిటెక్, ఫార్మసీ, తదితర కోర్సులలో ఉత్తీర్ణత కలిగిన, 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసున్న నిరుద్యోగ యువత అర్హులని వివరించారు. అందువల్ల ఈ జాబ్ మేళాలను జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకునే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకుగాను ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు, కరపత్రాలను పెద్ద ఎత్తున ముద్రించాలని , అన్ని పట్టణాలలో జన సమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఫ్లెక్సీ బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేయాలని, గోడపత్రికలను బస్సులు కళాశాలల వద్ద అతికించాలని చెప్పారు. జాబ్ మేళాకు వచ్చే నిరుద్యోగ యువతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, జాబ్ మేళా నిర్వహించనున్న పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఉన్న స్వర్ణ వేదిక ఫంక్షన్ హాలులో ఉదయం అల్పాహారం మొదలుకొని, మధ్యాహ్న భోజనము, అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
నిరుద్యోగ యువత జాబ్ మేళాకు వచ్చి ఉద్యోగాలు పొందే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, జాబ్ మేళా హాజరయ్యే వారు 5 సెట్ల రెజ్యుమ్ తో పాటు, ఇటీవలి కాలంలో తీసుకున్న రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తో సహా హాజరుకావాలని కోరారు. నిరుద్యోగ యువత ఉన్న చోటు నుండే క్యూ ఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
జాబ్ మేళా నిర్వహణపై ఈ నెల 22 న రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉదయం 11 గంటలకు సూర్యాపేటలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాల్ లు, తదితరులతో సమావేశం నిర్వహించనున్నారని,, అందువల్ల ఈ సమావేశానికి ప్రిన్సిపల్స్ అందరూ హాజరుకావాలని, సూర్యాపేటతో పాటు, నల్గొండ ,యాదాద్రి భువనగిరి జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాధికారులతో సమన్వయం చేసుకొని అందరు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు జాబ్ మేళా నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రత్యేకించి వారి పరిధిలోని అన్ని కూడళ్ళు, బస్టాండ్లు, జన సమర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేయించాలన్నారు. అన్ని బస్సులకు పోస్టర్లు అతికించేలా చూడాలని, ఆర్టీసీని రీజినల్ మేనేజర్ ను ఆదేశించారు. అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డిఆర్డిఓ, జిల్లా పరిశ్రమల మేనేజర్, జిల్లా ఇంటర్ వైద్యాధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి,జిల్లా ఉపాధి కల్పనాధికారి, ఆర్ టిసిఆర్ఎం, తదితరులు, హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking