అక్టోబర్ 23న ఖమ్మం లో జాబ్ మేళా
-జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్
-హైదరాబాద్ జెవిజి మేనేజ్మెంట్ లో 200 ఉద్యోగాలకై జాబ్ మేళా
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగం జెవిజి మేనేజ్మెంట్ హైదరాబాద్ ఏరో స్పేస్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ ఎలివేటర్స్ మాన్యు ఫాక్చరింగ్ యూనిట్ లో ఉద్యోగాలు కల్పించుటకు అక్టోబర్ 23న గురువారం ఉదయం 10.00 గంటలకు మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటిఐ., టేకులపల్లి) ఖమ్మం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ లో పని చేసే విధంగా టెక్నీషియన్స్ ( ఫ్రెషర్ ) పోస్టుకు ఐటిఐ ఎలక్ట్రికల్ ఫిట్టర్స్ టర్నర్స్ మెషినిస్టు వెల్డర్ అర్హత గల 19 నుండి 22 వయస్సుల యువతీ యువకులు అర్హులని ఎంపికైన వారికి వేతనం 11 వేల 500 నుండి 13 వేల వరకు ఉంటుందని అన్నారు.ట్రైనీ టెక్నీషియన్స్ ( ఫ్రెషర్ ) ఉద్యోగాల ఖాళీలకు 10వ తరగతి ఇంటర్ ఏదేని డిగ్రీ
అర్హత గల 19 నుండి 23 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు అర్హులని ఎంపికైన వారికి వేతనం 12 వేల 500 నుండి 14 వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. మొత్తం దాదాపు 200 ఉద్యోగాల భర్తీకి గాను జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తమ విద్యార్హతల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో జాబ్ మేళాకు అర్హత గల యువతీ, యువకులు హాజరు కావాలని ఇతర వివరాలకు 9010584000 నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆ ప్రకటనలో