ఆర్మీ భూములకే కన్నం

ఆర్మీ భూములకే కన్నం

దర్జాగా అనుభవిస్తున్న
కిషన్ రావు

ప్రజావాణిలో అడిషనల్
కలెక్టర్ విజేందర్ రెడ్డికి ఫిర్యాదు

ఆర్మీ ప్రభుత్వ భూములు
కాపాడాలి

కబ్జాదారులపై క్రిమినల్
కేసు నమోదు చేయాలి

బిజెపి మాజీ అధ్యక్షులు
ఆకుల సతీష్

మేడ్చల్, అక్షిత బ్యూరో :

దుండిగల్ గండి మైసమ్మ మండలం పరిది కొంపల్లి సర్వేనెంబర్ 100లో ఆర్మీకి చెందిన 776 ఎకరాల భూమిలో నుంచి తుర్కపల్లి గ్రామం సర్వేనెంబర్ 78 చూపిస్తూ 3.6 ఎకరాల ఆర్మీ ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టిన ఎమ్మెల్యే వివేకానంద అనుచరుడు కిషన్ రావు తదితరులపై తక్షణమే సర్వే చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేయాలని ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ సర్వే నెంబర్ 100, కొంపల్లి గ్రామం, దుండిగల్ మండలంలో ప్రభుత్వ భూమి 776 ఎకరాలు ఆర్మీ రీసెర్చ్ కోసం కేటాయించడం జరిగింది.

ఈ సర్వే నెంబర్ నందు 776 ఎకరాల ఆర్మీ ప్రభుత్వ భూమి చుట్టూ సరైన ఫెన్సింగ్ లేకపోవడం వల్ల తుర్కపల్లి గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 78కి చెందిన ఒక వ్యక్తి దగ్గర ఏజిపిఏ చేయించుకొని దాని ఆధారంగా స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద సహకారంతో వారి అనుచరులు కిషన్ రావు మరియు వారి కుమారులు దాదాపు 3.6 ఆర్మీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని దర్జాగా కాంపౌండ్ వాల్ నిర్మాణమే కాకుండా వెంచర్ని ప్లాట్లుగా చేసి బీటీ రోడ్లు మరియు కరెంటు స్తంభాలతో దాదాపు 100 కోట్ల విలువైన స్థలాన్ని తమ స్వాధీనంలో ఉంచుకోవడం జరిగింది.

ఈ విధంగా కొంపల్లి నుంచి మచ్చ బొల్లారం వెళ్లే మెయిన్ రోడ్ నానుకొని ఆర్మీకి చెందిన దాదాపు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆల్వాల్ మండల, తుర్కపల్లి గ్రామం సర్వేనెంబర్ 78 లో చూపిస్తూ దుండిగల్ మండలానికి చెందిన కొంపల్లి గ్రామంలో సర్వే నెంబరు 100 నందు ఆర్మీకి చెందిన ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని దర్జాగా జిహెచ్ఎంసి అనుమతులు లేకుండానే వెంచర్ మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణం మరియు రోడ్లు కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసుకున్న అల్వాల్ మరియు దుండిగల్ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకుండా ప్రత్యక్షంగా పరీక్షంగా సహకరించడానికి ముఖ్య కారణం టిఆర్ఎస్ ప్రభుత్వంలో మల్కాజిగిరి మరియు కుత్బుల్లాపూర్ చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల అండదండలే కారణమని మరియు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్మీ అధికారులు చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నట్టుగానే కనిపిస్తుంది.

ఇప్పటివరకు వెంచర్లో అమ్మకాలు మరియు నిర్మాణ పనులు మొదలు కాకపోవడానికి కారణం ఎవరైతే సర్వే నెంబరు 78 లో ఏజిపిఏ చేసిన వ్యక్తికి సరేనా డబ్బులు కిషన్ రావు కుమారులు చెల్లించకపోవడం ఒక కారణమైతే, ఆర్మీ అధికారుల నుంచి ఎన్టసి రాకపోవడం రెండవ కారణంగా కనిపిస్తుంది. ఈ విధంగా తుర్కపల్లి సర్వేనెంబర్ 78 లో చూపిస్తూ కొంపల్లి గ్రామం సర్వేనెంబర్ 100 ఆర్మీకి చెందిన ప్రభుత్వ భూమి కబ్జాపై పూర్తిస్థాయిలో సర్వే చేసి ప్రభుత్వ భూమిని గుర్తించి మరియు స్వాధీనం చేసుకోవాలని, ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో కబ్జా చేసుకుని దర్జాగా అనుభవిస్తున్న కిషన్ రావు మరియు వారి కుమారులపై మరియు ఈ ఆక్రమణలకు సహకరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, మర్రి రాజశేఖర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అక్రమంగా కాంపౌండ్ వాల్, రోడ్లు, కరెంటు స్తంభాలు నిర్మాణాన్ని కూల్చివేయాలని మరియు ప్రభుత్వ భూమి కబ్జా గురవుతున్న పట్టించుకోకుండా సహకరించిన దుండిగల్ తహసీల్దార్ మతిన్, ఆల్వాల్ తహసీల్దార్ పై, జిహెచ్ఎంసి ఆల్వాల్ డిప్యూటీ కమిషనర్ పై శాఖ పరంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ఆర్మీకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే &నాయకులు ప్రభుత్వ భూములు చెరువులే కాకుండా దేశ రక్షణ చేసే ఆర్మీ భూములు కూడా ఆక్రమించిన వీరిని దేశద్రోహులుగా గుర్తించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, చందు, ఈశ్వర్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking