సంగమేశ్వర–బసవేశ్వర  ప్రాజెక్టుల పూర్తికి పోరు

సంగమేశ్వర–బసవేశ్వర
   ప్రాజెక్టుల పూర్తికి పోరు

* మాజీ మంత్రి హరీష్ రావు

నారాయణఖేడ్, అక్షిత ప్రతినిధి :

నారాయణఖేడ్‌లో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సోయా–మక్క పంటలు కొని 48 రోజులు అయినా చెల్లింపులు చేయక రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. సాగు చేసిన భూమికే రైతుబంధు ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయం 70 లక్షల ఎకరాలకు నష్టం అని పేర్కొన్నారు. పత్తి, చెరుకు, తోటల రైతులకు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రైతుబంధు ఇవ్వడం అన్యాయం అన్నారు. యాసంగి బోనస్ 1150 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చీరల పంపిణీలో కూడా రాజకీయ ప్రయోజనం కోసం మహిళలను మోసం చేస్తున్నారని విమర్శించారు. నారాయణఖేడ్ లో నీటి సమస్య పెరిగిందని, కాళేశ్వరం నీటిని తీసుకువచ్చే బసవేశ్వర ప్రాజెక్టు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పనులు ప్రారంభించకపోతే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు, అవసరమైతే పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking