నాగారంలో కాంగ్రెస్ పరుగులు పల్లెల పోరులో ఘనవిజయం
ప్రజా పాలనకు ప్రజాతీర్పు కాంగ్రెస్ వైపు గ్రామాల మద్దతు
గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండా ప్రజలే కాంగ్రెస్ పార్టీకి పునాది
గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా 14కి 11 పంచాయతీలు గెలుపు
మండల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోగుల విక్రమ్
నాగారం అక్షిత న్యూస్ :
మండల వ్యాప్తంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడుదల కాంగ్రెస్ పార్టీ ఘనవిజయాన్ని నమోదు చేసి పల్లెల రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచిందని మండల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోగుల విక్రమ్ శనివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. మొత్తం 14 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగగా, వాటిలో 11 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజాపాలన ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని మహిళలు, యువతకు నేరుగా ఉపయోగపడే పథకాల వల్లే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డారని అన్నారు. ప్రజల నిత్యజీవిత సమస్యలకు పరిష్కారం చూపే పార్టీగా కాంగ్రెస్ ను గ్రామ ప్రజలు గుర్తించారని స్పష్టం చేశారు. వర్ధమానుకోట, ఈటూరు, ఫణిగిరి, పసునూరు, పస్తాల, మామిడిపల్లి, నాగారం బంగ్లా, లక్ష్మాపురం, మాచిరెడ్డిపల్లె, పేరబోయిన గూడెం, శాంతినగర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం ఈ ప్రజాదరణకు నిదర్శనమని తెలిపారు. ఈ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రచారం, ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను వినడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన మద్దతు ఇప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికల్లోను ప్రతిబింబించిందని అన్నారు. ప్రజలు ఒక్కసారి నమ్మకం ఉంచితే, అదే విశ్వాసాన్ని అన్ని స్థాయిల్లో కొనసాగిస్తారని ఈ ఫలితాలు స్పష్టంగా సూచిస్తున్నాయని అన్నారు. మండలంలో కాంగ్రెస్ పార్టీని ఓడించే రాజకీయ శక్తి ప్రస్తుతం ఏ పార్టీకి లేదని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఆ ప్రచారాలను తిరస్కరించి వాస్తవాలను గుర్తించారని అన్నారు. తప్పుడు సమాచారంతో ప్రజలను మోసం చేసే రాజకీయాలకు ఇక కాలం చెల్లిందని, నిజమైన ప్రజాసేవ చేసే పార్టీకే ప్రజలు మద్దతు ఇస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లడమే పార్టీ శ్రేణులు కష్టపడ్డాయని, ఆ కృషికే ఈ విషయం ఫలితమని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.