ఏసీబీకి చిక్కిన కేయూ ఎస్ఐ శ్రీకాంత్*

*ఏసీబీకి చిక్కిన కేయూ ఎస్ఐ శ్రీకాంత్*

హనుమకొండ, అక్షిత ప్రతినిధి:

హనుమకొండ జిల్లా కె యూ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్సై శ్రీకాంత్ ఏసీబీ అధికారులకు చిక్కాడు పేకాట కేసులో నిందితుడికి సానుకూలంగా వ్యవహరించేందుకు గాను రు. 15,000 వెల లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్న సమయంలో హనుమకొండ జిల్లా ఎసిబి అధికారులు ఎస్ఐ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేకాట కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని వేధిస్తూ కేసును మూసివేయాలంటే డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ శ్రీకాంత్ అడిగినట్లు సమాచారం. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం పట్టుకున్నారు. ఎస్సై శ్రీకాంత్ రూ.15000 లంచం తీసుకుంటున్న సమయం లో ఏసీబీ అధికాలు దాడి చేసి ఆయనను పట్టుకున్నారు. ఘటనకు సంబంధించిన కేసు వివరాలను నమోదు చేసి. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking