పుర పోరు సందడి

పుర పోరు సందడి

ఆశవాహుల కోలాహాలo

కొత్త మున్సిపాలిటీల్లో
      నయా జోష్

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 3 కొత్త మున్సిపాలిటీలు

– ఎల్లంపేట్, మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలు

– తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకై కసరత్తులు ప్రారంభించిన రాజకీయ నాయకులు

– మున్సిపాలిటీ ఎన్నికలపై
– ఎవరి ధీమా వారిదే

మేడ్చల్, అక్షిత ప్రతినిధి :

పురపాలికల్లో పుర పోరు సందడి నెలకొంది. కొత్తగా మూడు పుర పాలికలు పురుడు పోసుకోవడంతో ఆశావాహుల కోలాహాలo తలపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఎన్నికలు ప్రకటించడంతో రాజకీయ పార్టీలు ఎన్నికలపై దృష్టి సారించాయి. దీంతో పార్టీ నాయకులు తమ పార్టీ అభ్యర్థుల వేటలో పడడంతో పాటు వారిని గెలిపించుకునేందుకు కసరత్తులు ప్రారంభించారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా లో ఇంతకు ముందు జరిగిన ఎన్నికల సమయంలో 9 మున్సిపాలిటీలు, 4 కార్పోరేషన్ లు జీహెచ్ఎంసీలో విలీనం అవడంతో మిగిలిన గ్రామాలను 3 మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటైన ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలలో మొదటిసారి మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

కొత్తగా 3 పురపాలికలకు పురుడు

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అన్ని కుదురితే ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం జనవరి 1 న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. ఈ నెల 5న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో మున్సిపల్ కమిషనర్లు సమావేశం నిర్వహించారు. దీంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల వేటలో పడ్డారు. నాయకులు పార్టీ నుండి టికెట్ పొందేందుకు కసరత్తులు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో ఉన్న మూడు కొత్త మున్సిపాలిటీలు ఎల్లంపేట్, మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలు ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఈ నెల 12న తుది జాబితాను ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో
24 వార్డులు

– మున్సిపల్ కమీషనర్ స్వామి

ఎల్లంపేట్ మున్సిపాలిటీని 24 వార్డులుగా ఏర్పాటు చేయడం జరిగిందని కమీషనర్ స్వామి తెలిపారు. మేడ్చల్ జిల్లాలో నూతనంగా ఏర్పాటైన ఎల్లంపేట్ మున్సిపల్ లో ఎల్లంపేట్, రాంజబొల్లారం తండా, రాజబొల్లారం, రావల్ కోల్, సైదోనిగడ్డ తండా, సోమారం, డబిల్ పూర్, కోనాయిపల్లి, మైసిరెడ్డిపల్లి, నూతన్ కల్, శ్రీరంగవరం, లింగాపూర్ గ్రామాలతో కలిపి 24 వార్డులుగా ఏర్పాటు చేయడం జరిగిందని కమీషనర్ ఎ.స్వామి తెలిపారు. ఈ 24 వార్డుల్లో మొత్తం 22వేల 581 ఓటర్లు ఉన్నారని తెలిపారు. అందులో పురుషులు 11వేల 285, స్త్రీలు 11వేత 296, ఓటర్లు ఉన్నారని తెలిపారు. 48 పోలింగ్ స్టేషన్ లు ఉండే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈ నెల 1న డ్రాప్ట్ ఓటర్ జాబితా విడుదల చేయడం జరిగిందన్నారు. 5న అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఓటర్లు తమ వార్డులో కాకుండా వేరే వార్డులో పడితే మున్సిపల్ కార్యాలయంలో అభ్యంతరాలు చెప్పుకుంటే సవరణ చేయడం జరుగుతుందన్నారు.

*20 వార్డులుగా
అలియాబాద్ మున్సిపల్

– మున్సిపల్ కమీషనర్ చంద్రశేఖర్

అలియాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులుగా ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు.

అలియాబాద్ మున్సిపల్ లో అలియాబాద్, లాల్ గడి మలక్ పేట్, తుర్కపల్లి, మజీద్ పూర్, మురహరిపల్లి, యాడారం గ్రామాలను కలుపుకొని 20 వార్డులుగా ఏఱ్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇందులో 20వేల 454 ఓటర్లకు గానూ పురుషులు 10వేల 336 మంది, స్త్రీలు 10వేల 115 మంది, ఇతరులు 3 ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. 20 పోలింగ్ స్టేషన్ లు ఉండే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆధేశాల మేరకు ఈ నెల 1న డ్రాప్ట్ ఓటర్ జాబితా విడుదల చేయడం జరిగిందన్నారు. 5న అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఓటర్లు తమ వార్డులో కాకుండా వేరే వార్డులో పడితే మున్సిపల్ కార్యాలయంలో అభ్యంతరాలు చెప్పుకుంటే సవరణ చేయడం జరుగుతుందన్నారు.

మూడుచింతలపల్లి
మున్సిపల్ లో 24 వార్డులు

– మున్సిపల్ కమీషనర్ పవన్ కుమార్

మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 24 వార్డులుగా ఏర్పాటు చేయడం జరిగిందని కమీషనర్ పవన్ కుమార్ తెలిపారు. మూడుచింతలపల్లి మున్సిపల్ లో మూడుచింతలపల్లి, ఆద్రాస్ పల్లి, అనంతారం, జగన్ గూడ, కేశ్వాపూర్, కేశవరం, కొల్తూర్, లక్ష్మాపూర్, లింగాపూర్ తండా, నాగిశెట్టిపల్లి, నారాయణపూర్, పోతారం, పొన్నాల్, ఉద్దెమర్రి గ్రామాలను కలుపుకొని 24 వార్డులుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఇందులో 22 వేల 831 ఓటర్లకు గానూ పురుషులు 11వేల 430, స్త్రీలు 11వేల 401 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 48 పోలింగ్ స్టేషన్ లు ఉండే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈ నెల 1న డ్రాప్ట్ ఓటర్ జాబితా విడుదల చేయడం జరిగిందన్నారు. 5న అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఓటర్లు తమ వార్డులో కాకుండా వేరే వార్డులో పడితే మున్సిపల్ కార్యాలయంలో అభ్యంతరాలు చెప్పుకుంటే సవరణ చేయడం జరుగుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking