మేడ్చల్, అక్షిత ప్రతినిధి: జిహెచ్ఎంసి పరిధిలోని మేడ్చల్ డివిజన్ లో గల గిర్మాపూర్ లో స్వయంభూగా వెలసిన శ్రీ గుట్టల మల్లన్న స్వామి జాతర కన్నుల పండువగా జరిగింది. స్వామి వారికి ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిర్మాపూర్ నుండే కాకుండా చుట్టు ప్రక్కల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకం, హోమం, పట్టం తొక్కుట, అగ్ని గుండాలు, గొలుసు తెంపుట, బోనాల సమర్పణ వంటి కార్యక్రమాలు చేశారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ అద్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా మాజీ గ్రంధాలయ ఛైర్మన్ భాస్కర్ యాదవ్ తో పాటు పలువురు శ్రీ గుట్టల మల్లన్న స్వామి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కర్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, ఆలయ ఛైర్మన్ వంగేటి పద్మారెడ్డి, నాయకులు ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, తాల్లపల్లి ఉపేందర్, వేలూరి సంతోష్, ప్రేమ్ దాస్, వంశి రెడ్డి, అవినాష్, భరత్, మామిన్ల వేణు, చీర్ల సత్యనారాయణ, రాఘవరెడ్డి, బొక్క మల్లారెడ్డి, భిక్షపతి, మల్లేష్, బాబుగౌడ్, సురేష్ గౌడ్, మల్లారెడ్డి, రవిందర్ రెడ్డి, అనిల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

