చేర్యాల, అక్షిత ప్రతినిధి: చేర్యాల మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం చేర్యాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనుల సమీక్ష కార్యక్రమంలో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మున్సిపాలిటీలోనీ పలు వార్డులలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ అధికారులతో వార్డులలో నెలకొన్న అనేక అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన అనంతరం అధికారులకు ఎంపి, ఎమ్మెల్యే పలు సూచనలు చేస్తూ ప్రజల అభీష్ట మేరకే వార్డులలో పనులు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి విడుదలైన నిధులను సక్రమంగా ప్రజల యొక్క అవసరాల కోసం వినియోగించి ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు. ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా మున్సిపాలిటీలో తక్షణమే చేయవలసిన తాజా అభివృద్ధి పనులను ప్రజల అవసరాల దృశ్య మున్సిపాలిటీ కేటాయించిన నిధులతో తక్షణమే పనులను మొదలుపెట్టాలని సూచించినట్టు తెలిపారు. సమావేశం అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేర్యాల పెద్ద చెరువు కట్టపై నిర్మించనున్న ఫుట్ పాత్, వాకింగ్ ట్రాక్ పనుల సమీక్ష నిర్వహించి అతి తొందరలో పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నాగేందర్, మాజీ జెడ్పిటిసిలు గిరి కొండల్ రెడ్డి, కొమ్ము నరసింగరావు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆయా పార్టీల గ్రామ సర్పంచులు, ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ ఏడి, ఆర్ అండ్ బి ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.