సంస్కృతికి ప్రతీక రంగవల్లులు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి: మిర్యాలగూడ పట్టణంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ముగ్గుల పోటీలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. 9వ వార్డు ప్రకాష్ నగర్, 6వ వార్డు ఇందిరమ్మ కాలనీ, 17వ వార్డు హౌసింగ్ బోర్డు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర, అలాగే 27వ వార్డు శాంతినగర్ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో వీధులన్నీ కళాకాంతులతో నింపారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి – కవిత దంపతులు, డీసీసీ జనరల్ సెక్రటరీ చిలుకూరి బాలు, 22వ వార్డు ఇన్‌చార్జ్ పగిడి మిర్యాలగూడ పట్టణంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ముగ్గుల పోటీలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 9వ వార్డు ప్రకాష్ నగర్, 6వ వార్డు ఇందిరమ్మ కాలనీ, 17వ వార్డు హౌసింగ్ బోర్డు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర, అలాగే 27వ వార్డు శాంతినగర్ ప్రాంతాలలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ చిలుకూరి బాలు, 22వ వార్డు ఇన్‌చార్జ్ గోవర్ధనచారి, టౌన్ సోషల్ మీడియా కన్వీనర్ శరత్ లు ముగ్గుల పోటీలను తిలకించి, విజేతలైన మహిళలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా శాంతినగర్‌లో జరిగిన ప్రత్యేక సభలో వారు మాట్లాడుతూ.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో మహిళల పాత్ర అత్యంత కీలకమన్నారు. ముగ్గుల ద్వార సంస్కృతి గొప్పతనాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు అండగా నిలుస్తుందన్నారు. ముగ్గుల పోటీలకు బహుమతులు స్పాన్సర్ చేసిన వ్యాపారవేత్త గుడిపాటి నవీన్, ఇందిరమ్మ కాలనీలో స్పాన్సర్ చేసిన అశోక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మహిళలు, స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking