23న టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ.!

సూర్యాపేట, అక్షిత ప్రతినిధి : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం,హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) సూర్యాపేట జిల్లా 4వ మహాసభ ఈనెల 23న జిల్లా కేంద్రంలో జరగనున్నట్లు ఫెడరేషన్ జిల్లా అడ్ హక్ కమిటీ నాయకులు ప్రకటించారు.ఈ మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని కమిటీ నేతలు సోమవారం జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంఘం మహాసభలు జరుగన్నాయని,అందులో భాగంగానే ఈనెల 23న సూర్యాపేట జిల్లా మహాసభ జరుపుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదని, జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్నది కేవలం తమ సంఘమే అని,సమస్యలపై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ ఉంటుందని అన్నారు. జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలైన అక్రెడిటేషన్లు, ఇండ్లు, ఇండ్ల స్ధ‌లాల, హెల్త్ కార్డులు, పెన్షన్, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య,ఉచిత బస్ పాస్ తదితర డిమాండ్ల సాధనకు టీడబ్ల్యూజేఎఫ్ రాజీలేని పోరాటం చేస్తుందని వారన్నారు. ఫెడరేషన్ చేస్తున్న పోరాటాలకు జిల్లాలోని జర్నలిస్టులంతా కలిసి రావాలని వారు పిలుపునిచ్చారు. మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పాల్వాయి జానయ్య,కో కన్వీనర్లు ముషం హరిప్రసాద్, లింగాల సాయిబాబా, నందిపాటి సైదులు, శ్రీరామల కృష్ణ, తాందార్ పల్లి శ్రీనివాస్, గూడపూరి ప్రభాకర్, పాల్వాయి అజయ్, పి.సతీష్, ఎస్.సైదులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking