పెద్దపులినాగారం గ్రామంలో రోడ్డు ప్రమాదం.!

  • పెద్దపులినాగారం గ్రామంలో రోడ్డు ప్రమాదం
  • తృటిలో తప్పించుకున్న డబిల్ గూడా గ్రామస్తులు
  • గ్రామంలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి -కుండే కుమార్

మహేశ్వరం, అక్షిత ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కుండే కుమార్ మాట్లాడుతూ.. ఉదయం 4:30 కి గ్రామంలో.. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది డబిల్ గూడా గ్రామానికి చెందిన ఇద్దరూ వ్యక్తులు కారులో వస్తుండగా ప్రమాదం జరిగిందని అన్నారు.. గ్రామంలో స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం వలన కారు అతివేగంగా రావడంతో గ్రామంలో ఉన్న స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం కింది భాగం పూర్తిగా విరిగిపోవడం కారు మూడు రౌండ్లు అల్టికొట్టింది ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ పట్టించుకునే అధికారులే లేరని తెలిపారు ఇప్పటికైనా గ్రామంలో అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో స్పీడ్ బ్రేకర్లు వేయించవలసిందిగా కోరారు లేదంటే ఒక వారం వరకు చూసి అధికారులు చేయని యెడల బిజెపి పార్టీ తరఫున గ్రామంలో స్పీడ్ బ్రేకర్లు వేయించి ప్రమాదాలను అరికడతామని బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కుండే కుమార్ తెలియజేశారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking