భూభారతి పోర్టల్ కే కన్నం

భూభారతి పోర్టల్ కే కన్నం..

వలిగొండ/ అక్షిత న్యూస్:

భూభారతి రిజిస్ట్రేషన్ లావాదేవీలలో తక్కువ స్టాంపు డ్యూటీ చెల్లించిన కేసులను ధ్రువీకరించాలని కలెక్టర్ ఆదేశానుసారం మండలంలోని భూభారతి ఆపరేటర్ లు కలకూరి మధు, భువనేష్, బసవరాజు, రాజు, రాకేష్, శివరామకృష్ణ తరుణ్ అనే వ్యక్తులు భూభారతి రిజిస్ట్రేషన్ లో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి తక్కువ చూపించినందుకు చర్యలు తీసుకోవాలని వలిగొండ మండల తహసిల్దార్ దశరథ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. భూభారత రిజిస్ట్రేషన్ లో మొత్తం ఇట్టి వ్యక్తుల నుంచి 15 లక్షల 58,472 రూపాయలు తప్పుడుగా నమోదు చేయడంతో వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వలిగొండ ఎస్సై యుగేందర్ గౌడ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking